Thursday, June 13, 2024
Homeతెలంగాణసుల్తానాబాద్ బిజెపి అధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సుల్తానాబాద్ బిజెపి అధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సుల్తానాబాద్ బిజెపి అధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సుల్తానాబాద్,జూన్02(కలం శ్రీ న్యూస్):
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10సం.రాలు పూర్తి అయిన సందర్భముగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ , బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్  పిలుపు మేరకు సుల్తానాబాద్ మండల కేంద్రములోని తెలంగాణ చౌరస్తా వద్ద పట్టణ అధ్యక్షులు ఏళ్లంకి రాజన్న జాతీయజెండా ఎగురవేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎందరో అమరుల బలిదానం, తొలి,మలి దశల ఉద్యమాల్లో చిందించిన నెత్తుటి త్యాగఫలం ఈ తెలంగాణ. సబ్బండ వర్ణాలు, సకల వృత్తులు ఏకమై పోరాడి సాధించిన ఈ పవిత్ర తెలంగాణ రాష్ట్రము నిజం పరిపాలనను గుర్తుకు తెస్తూ గడీల చేతిలో బందీ అయిపోయింది. ఈ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. అలాగే అమరుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయజెండా ఎగురవేసి స్వీట్స్ పంపిణీ చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సౌదరి మహేందర్ యాదవ్, కొమ్ము తిరుపతి యాదవ్, వేగొలపు సదయ్య గౌడ్, కామని రాజేంద్రప్రసాద్, వెగొలం మల్లికార్జున్, ఉషన అన్వేష్, అరేపల్లి రాహుల్, పల్లే తిరుపతి యాదవ్, అరేపల్లి రాకేష్, వడ్లకొండ మహేష్, బుర్ర సతీష్ గౌడ్, కొల్లూరి సంతోష్, దాసరి శ్రవణ్, దాసరి నరేష్, వీరగోని కిరణ్, పోచంపల్లి ఈశ్వర్, ఎనగందుల సతీష్, కూకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!