తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
పెద్దపల్లి,జూన్02(కలం శ్రీ న్యూస్):పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1200 మంది అమరుల త్యాగం వాళ్ళని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వారి కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఉద్యమకారులు 13 సంవత్సరాలు ఎన్నో అవమానాలు ,ఆటుపోట్లు , జైలు జీవితాలు భరించుకుంటూ ఉద్యమం ఊపిరిగా బతికారని వారికి ప్రత్యేక రాష్ట్రంలో కనీసం గౌరవం లేదన్నారు.నరాలు తెగిపోతాయి అన్నట్టుగా ఉద్యమకారులు ఉద్యమం చేశారని, తమను గుర్తించే నాయకుల లేరని, ఉద్యమకారులు మనస్తత్వానికి గురవుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీ కి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు.ఉద్యమకారులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, రాష్ట్రంలో ఉద్యమ ద్రోహులకు ఉన్న విలువ ఉద్యమకారులకు లేదని కెసిఆర్ కనీసం ఇప్పుడైనా ఉద్యమకారుల గురించి ఆలోచించాలని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యమకారులను ఆదుకున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యమకారులు అసమతితో ఉన్నారని ఉద్యమకారులను ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షులు బత్తుల శంకర్ , జిల్లా వైస్ ప్రెసిడెంట్ జున్నుగారి సుధాకర్ , తెలంగాణ సీనియర్ ఉద్యమ నాయకులు బూర్ల ధనంజయ , చింతకుంట వెంకటరెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు పెంచాల మల్లయ్య గౌడ్ , జిల్లా కార్యదర్శి తొట్ల రాజ కొమురయ్య , కల్వల శంకర్ , ఎడ్ల కేశవరెడ్డి , మూల మల్లేశం , శ్రీనివాస్ , రాము తదితరులు పాల్గొన్నారు…