Tuesday, October 8, 2024
Homeతెలంగాణమిల్లర్లతో కుమ్మక్కెన ప్రభుత్వం

మిల్లర్లతో కుమ్మక్కెన ప్రభుత్వం

మిల్లర్లతో కుమ్మక్కెన ప్రభుత్వం

మంథని మే 1(కలం శ్రీ న్యూస్):: ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిండా ముంచుతోందని తెలుగుదేశం పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాదాడి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం తూకం విషయంలో జరుగుతున్న మోసాలకు,లారీల కొరతలో జాప్యానికి నిరసిస్తూ మంథని నియోజకవర్గం లోని ఐకెపి సెంటర్లలో మరియు మార్కెట్ కమిటీలలో ధాన్యం కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి. ఒక దిక్కు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తనట్టు చూస్తూ ఉంటూ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు.మరియు జూన్ 2వ తేదీ నుండి 22వరకు జరిగే టిఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల మీద ఉన్న ప్రేమ తెలంగాణ రాష్ట్ర రైతుల మీద లేదా అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో మెండే రాజయ్య తెలుగుదేశం పార్టీ పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మండల అధ్యక్షులు మాదవెన ఓదెలు,యువత అధ్యక్షులు బడుగు మహేష్,మట్ట శంకర్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!