పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేవు
–వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్
మంథని మే 17(కలం శ్రీ న్యూస్):మంథని మండలం విలోచవరం గ్రామంలో బుధవారం జరుగుతున్న ఉపాధి హామీ పనుల ప్రదేశాన్ని పరిశీలించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్. ఈ సందర్బంగా మాట్లాడుతూ కూలీలు ఎండకు విలవిలలాడుతున్నారని,పని ప్రదేశంలో నీరు మరియు నీడ, లాంటి షెడ్లు, లేకుండా అలాగే ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్లను, కూడా ఇప్పటివరకు ఇవ్వకపోవడం దుర్మార్గం అని అన్నారు. కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కపట ప్రేమ ఇక్కడే అర్థమవుతుందని కూడా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే ఈ యాప్ సరిచేయాలని సూచించారు. వందరోజుల పని దినాలను 200కు పెంచాలని, రోజువారి కూలీ 600 ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పుట్ట సంతోష్ ,సమ్మయ్య, శ్రీను, రవి, శ్రీధర్, కళావతి, సుమలత, విజయ,తదితర వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.