ఎంపీటీసీ,ఎంపీపీ, జెడ్పీటీసీగా పుట్ట మధుకు అవకాశం కల్పించిన ఘనత శ్రీధర్ బాబుది.
విగ్రహాలతోనే అభివృద్దా..
విగ్రహ ఆవిష్కరణ పేరుతో కాంగ్రెస్ పార్టీనీ, దుద్దిళ్ళ కుటుంబాన్ని విమర్శించడం సిగ్గుచేటు
మంథని మే 17(కలం శ్రీ న్యూస్):మంథని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు సేగ్గం రాజేష్, మంథని మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ వొడ్నాల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ లు మాట్లాడుతూ నిన్న బీపీ మండల్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని,దుద్దిళ్ళ కుటుంబాన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు.శ్రీనివాస్ గౌడ్,కదిరే కృష్ణ, జయరాజ్ లాంటి వ్యక్తులు పుట్ట మధు అనే వ్యక్తి ఎలాంటి వాడో ఈ ప్రాంతంలో తెలుసుకొని రావాలి.మంథని నియోజకవర్గంలో పుట్ట మధు బీసీ నాయకుడు అని ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే దళితులపై, బీసీలపై దాడులు, ఈ ప్రాంతంలో ఎన్నడు లేని విధంగా హత్యలు చేసిన ఘనత పుట్ట మధు ది, అలాంటి వ్యక్తికి శ్రీనివాస్ గౌడ్, కదిరే కృష్ణ, జయరాజ్ లాంటి వ్యక్తులు వచ్చి వత్తాసు పలకడం సరైనది కాదు.
విగ్రహ ఆవిష్కరణ పేరుతో కాంగ్రెస్ పార్టీనీ, దుద్దిళ్ళ కుటుంబాన్ని వారి బ్రాహ్మణ కులాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిబాపూలే వంటి మహనీయులకు బ్రాహ్మణులు ఎంతో సహాయ సహకారాలు అందించారు.ఎంపీటీసీ,ఎంపీపీ, జెడ్పీటీసీగా పుట్ట మధుకు అవకాశం కల్పించిన ఘనత శ్రీధర్ బాబుది. కేవలం మంథని సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ గా వారి సతీమణికే అవకాశం ఇచ్చి కుటుంబ రాజకీయం ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలకు కనపడుతుంది.ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించారు గనకనే 40 సంవత్సరాలగా దుద్దిళ్ళ కుటుంబానికి ప్రజలు పట్టం కట్టారు. బీపీ మండల్ విగ్రహాన్ని పెట్టి వారి గొప్పతనం గురించి చెప్పకుండా శ్రీధర్ బాబు ని విమర్శించడం సిగ్గు చేటు చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని తెలియజేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో అది మాట్లాడాలి తప్ప విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ విమర్శించడం సరైన కార్యక్రమం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గాని కేంద్రంలోని అధికారంలోలేదని తెలియజేశారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్వర్గీయ శ్రీపాద రావు విగ్రహాలు ఏర్పాటు చేయాలని వారి విగ్రహాలు పెట్టించింది నువ్వు కాదా. ధన్వాడ గ్రామంలో కేవలం శ్రీధర్ బాబు నివాసమే కనిపిస్తుందని చెపుతున్న సోదరీమణి ఆ గ్రామంలోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది. చదువుకున్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడడం సిగ్గుచేటు.బిపి మండల్ విగ్రహావిష్కరణ చేసి వారి గొప్పతనం వారు చేసిన సేవ కార్యక్రమాల గురించి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు ని విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనం అని బహుజన వాదం బీసీ వాదం ముసుకుతో ప్రజలను మరొకసారి మోసం చేయాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు ఎస్సి, బిసి,మైనార్టీ లందరూ శ్రీధర్ బాబు వెంటే ఉన్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెరవేణి లింగయ్య యాదవ్, నూకల బాణయ్య,మంథని సత్యం, రావి కంటి సతీష్,కుడుదుల వెంకన్న, జంజర్ల శేఖర్, రాం రాజశేఖర్, మంథని రాకేష్, వేల్పుల రాజు, పెంటరీ రాజు,మంథని శ్రీనివాస్, ఆర్ల నాగరాజు,ఎరుకల ప్రవీణ్,పెరుగు తేజ, బండారి తిరుపతి,ప్రసాద్, దొనగొర్ల శ్రీనివాస్ యాదవ్,పొనగంటి రమేష్, రాం మూర్తి, రోడ్డ రాజేశ్వర్ రావు, పొరాండ్ల రంజిత్, కేక్కర్ల సందిఫ్,బడికల మనోజ్, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.