Saturday, July 27, 2024
Homeతెలంగాణబిసి మహిళ పై వేధింపులేనా...

బిసి మహిళ పై వేధింపులేనా…

బిసి మహిళ పై వేధింపులేనా…

రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్

మంథని,మే 17(కలం శ్రీ న్యూస్):బిపి మాండల్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఉండాల్సిన వ్యక్తే జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సొంత ఎజెండా కోసం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ అన్నారు. బుధవారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిపి మండల్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో బీసీ లందరికీ రిజర్వేషన్ ఉండాలని ప్రయత్నం చేసిన వ్యక్తి అన్నారు. బీసీ రిజర్వేషన్లు భాగంగా కేసిఆర్ ఆశీస్సులతో రామగిరి మహిళా ఎంపిపి గా ఎన్నికయ్యాను అని అన్నారు. నేను ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నేటి వరకు మాపై మహిళా అని చూడకుండా కక్ష సాధింపులు వేధింపులు చేస్తూనే ఉన్నారన్నారు. బిపి మండల్ ఆశయాలను కొనసాగిస్తున్నాను అన్న నీవు నిన్నటి సభలో మహిళా అని చూడకుండా, గౌరవించకుండా, ఆహ్వానించకుండా మీ ఆదర్శాలు ఎక్కడ పోయాయి అని అన్నారు. నిన్న జరిగిన కార్యక్రమంలో కేసిఆర్ ఫోటో లేదు ఎందుకు పెట్టలేదని అన్నారు. కేసిఆర్ దయా దక్షిణాలపై పదవి కట్టబెడితే కార్యక్రమాల్లో కూడా ఫోటో పెట్టవా అని ప్రశ్నించారు.

2014లో అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ అయిన సునీల్ రెడ్డి ని కాదని కేసీఆర్ ఈ ప్రాంతంలో ఒక బీసీ బిడ్డ ఉండాలని ఉదేశ్యంతో నీకు టికెట్ ఇస్తే, టికెట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం బీసీలం, ఎస్సీలం, నీతో సన్నిహిత్యంగా ఉండే రెడ్డిలు, బ్రాహ్మణులూ అందరు కలిసి ఓట్లు వేస్తేనే నీవు శాసన సభ్యునిగా గెలిచావన్నారు.

ఏమి చేయకున్నా మళ్లీ 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ నీకు టికెట్ ఇస్తే రాష్ట్రమంతా టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పేరుతో అందరు గెలిస్తే ఇక్కడి ప్రజలు నిన్ను చికోట్టి ఓడగొట్టారన్నారు.ప్రాంత ప్రజలు నీ యొక్క స్వభావాన్ని గుర్తించి ఈ ప్రాంతానికి పనికి రావనే ఉద్దేశంతో నిన్ను రాజకీయంగా ఓడించారన్నారు. అయినా మళ్లీ ఒక బీసీ బిడ్డ అని గుర్తించి కెసిఆర్ మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడన్నారు. 2014 ముందు నీ కుటుంబము నీ ఆస్తి ఎంతనని, 2014 నుండి నేటి వరకు నీ ఆస్తి విలువ ఎంతనన్నారు. మీయొక్క ఆస్తి నీ పేరు పైన ఉన్న, నీ కుటుంబ సభ్యుల పేరు పైన ఉన్న ఎంతుందో, నిజాయితీగా ఎలా సంపాదించవో ఒక శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!