మృతుని కుటుంబానికి బియ్యం పంపిణీ చేయించిన బొద్దుల లక్ష్మణ్
పెద్దపల్లి,మే 17(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వీర్ల శంకరయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి స్థానిక నాయకులు, కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ కి వివరించి వారి కుటుంబానికి సహాయం అందించాలని కోరగా, వెంటనే స్పందించి కెసిఆర్ సేవా దళం జిల్లా నాయకులు బింగి రాజు ద్వారా బియ్యం పంపిణీ చేయడం జరిగింది.
అడగగానే స్పందించి వారి కుటుంబానికి సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన శంకరయ్య కుటుంబ సభ్యులు గ్రామస్తులు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గాదాసు అంజయ్య, కెసిఆర్ సేవా దళం జిల్లా నాయకులు షేక్ షకీల్, సాయినాథ్, రాములు, కిరణ్, చందు తదితరులు పాల్గొన్నారు.