హమాలీ కార్మికులకు టీ షర్ట్స్, బట్ట సంచులను పంపిణీ చేయించిన బొద్దుల లక్ష్మణ్
పెద్దపల్లి,మే17(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని స్థానిక నాయకుల కోరిక మేరకు, కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్, హమాలీ కార్మికులకు టీ షర్ట్స్, బట్ట సంచులను స్థానిక సర్పంచ్ అంజయ్య ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
అడగగానే స్పందించి వారి కోరిక మేరకు టీ షర్ట్స్, బట్ట సంచులను పంపిణీ చేయించిన *బొద్దుల లక్ష్మణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, బొద్దుల లక్ష్మణ్ మున్ముందు ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, జిల్లా నాయకులు రాయనవేని శ్రీనివాస్, సదానందం తదితరులు పాల్గొన్నారు.