Saturday, July 27, 2024
Homeతెలంగాణబీపీ మండల్‌ పోరాటాన్ని గుర్తించిన నాయకులు పుట్ట మధూకర్‌....

బీపీ మండల్‌ పోరాటాన్ని గుర్తించిన నాయకులు పుట్ట మధూకర్‌….

బీపీ మండల్‌ పోరాటాన్ని గుర్తించిన నాయకులు పుట్ట మధూకర్‌…. తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్ యాదవ్ 

మంథని మే 16(కలం శ్రీ న్యూస్):బీసీ వర్గాలు రిజర్వేషన్‌లతోనే సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతారనే ఆలోచనతో బీపీ మండల్‌ చేసిన పోరాటాన్ని గుర్తించిన ఏకైక నాయకులు పుట్ట మధూకర్‌ అని తెలంగాణ రాష్ట్రటూరిజం కార్పోరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని కార్యక్రమాన్ని పుట్ట మధూకర్‌ చేశారని, ఇప్పటి వరకు ఏ కుల సంఘాలు చేయని బీపీ మండల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయమన్నారు, ఆనాడు బీసీ రిజర్వేషన్‌ల బాగు కోసం కేంద్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించిన మహనీయుడు బీపీ మండల్ అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బీసీలకు ఎక్కడా రిజర్వేషన్‌లు లేవని, ఏ ప్రభుత్వాలు గుర్తించలేదన్నారు. ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కాకా కాలేక్కర్‌ కమీషన్‌ ఏర్పాటు చేసి రిజర్వేషన్‌లు వద్దని రిజక్ట్‌ చేసిందన్నారు. అటుతర్వాత వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వంలో మురార్జీ దేశాయ్‌ ప్రధాన మంత్రి తర్వాత బీపీ మండల్‌ కమీషన్‌ ఏర్పాటు చేస్తే దేశంలో అనేక కులాలు ఉన్నాయని బీసీలకు రిజర్వేషన్‌లు ఖచ్చితంగా ఉండాలని నివేదికలు సమర్పించారన్నారు. కానీ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నా మండల్‌ కమీషన్‌ అమలు కాలేదని, వీపీ సింగ్‌ ప్రధానమంత్రి అయిన తర్వాత మండల్‌ కమీషన్‌ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆనాటి కాంగ్రెస్‌, బీజేపీలు ఓర్వలేదన్నారు. బీసీలకు రిజర్వేషన్‌లు ఉండకూదని బీసీలు బాగుపడవద్దని వీపీ సింగ్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టి బీసీల గొంతు కోసింది బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలేనని ఆయన అన్నారు. మనకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ మనకు అవసరమా అని ప్రశ్నించారు. కానీ ఈనాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎంకేసీఆర్‌ బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని, ఈనాటికి బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు రిజర్వేషన్‌లు అమలు చేస్తామని, బీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!