Saturday, July 27, 2024
Homeతెలంగాణపంచాయతీ నుంచి పార్లమెంట్‌ దాకా మనోళ్లే ఉండాలే... పెద్దపల్లి ఎంపి వెంకటేష్‌నేత..

పంచాయతీ నుంచి పార్లమెంట్‌ దాకా మనోళ్లే ఉండాలే… పెద్దపల్లి ఎంపి వెంకటేష్‌నేత..

పంచాయతీ నుంచి పార్లమెంట్‌ దాకా మనోళ్లే ఉండాలే… పెద్దపల్లి ఎంపి వెంకటేష్‌నేత..

మంథని మే 16(కలం శ్రీ న్యూస్ ):పంచాయతీ నుంచి పార్లమెంట్‌ దాకా మనోళ్లే ఉండాలని పెద్దపల్లి పార్లమెంట్‌సభ్యుడు బోర్లకుంట వెంకటేష్‌నేత అన్నారు. ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా, ఏ పని కావాలన్నా అధికారంలో మనోళ్లే ఉండాలని,మధ్యలో కాంగ్రెస్సోళ్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేవలం అధికారం కోసం ఆరాటపడుతూ ఓట్లతర్వాత కన్పించని నాయకుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈనాడు మంథనిలో మహనీయుల విగ్రహాలు ఎందుకు నెలకొల్పుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. మహనీయుల చరిత్రను తెలుసుకుని చర్చిస్తేనే వారికి నిజమైన నివాళి అర్పించినట్లని ఆయన అన్నారు. బీసీ సామాజికవర్గాలకు రిజర్వేషన్‌లు అందించి ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేయాలనే ఆలోచనతోనే ఆనాడు బిందేశ్వరి ప్రసాద్‌మండల్‌ అప్పటి ప్రభుత్వాలపై పోరాటం చేశారన్నారు. తన పదవులను సైతం లెక్క చేయకుండా బీసీ వర్గాలకు న్యాయం చేయాలని ఆకాంక్షించిన గొప్ప మహనీయుడు బీపీ మండల్‌ అని కొనియాడారు. బీపీ మండల్‌స్పూర్తితోనే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని ఆయన గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 19 రెసిడెన్సియల్‌ పాఠశాలలు ఉంటే ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో 294రెసిడెన్షియన్‌ పాఠశాలలను ఏర్పాటుచేసుకోవడం జరిగిందని, ఈ పాఠశాలల్లో చదువుకునే ఒక్కో విద్యార్ధికి లక్ష రూపాయల మేర ఖర్చు చేస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోందన్నారు. అలాగే బీసీ విద్యార్దులపై ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 375కోట్లు కేటాయిస్తే ఈనాడు బీసీ విద్యార్దులు ఉన్నతస్థాయికి ఎదుగాలని రూ,3800కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. అలాగే గొల్లకుర్మ, గౌడ, మత్స్యకారులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రత్యేక నిధులు కేటాయించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. అయితే గత ప్రభుత్వాలు మాత్రం బీసీలపట్ల వివక్ష చూపాయని, రిజర్వేషన్‌లు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆయన తెలిపారు. బీపీ మండల్‌ పోరాట ఫలితంగానే బీసీలకు రిజర్వేషన్‌లు అందాయని, వాటి ఫలితంగానే ఈనాడు అనేక మంది ఫలాలు పొందుతున్నారని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!