మంథని లో బీజేపీ పార్టీ గెలుపే మన లక్ష్యం..
మంథని మే 16(కలం శ్రీ న్యూస్):పెద్ద పల్లి జిల్లా మంథని పట్టణంలో మంథని బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మంథని నియోజకవర్గ అన్ని మండలాల,అధ్యక్షులు,ఇంచార్జ్ లు సమావేశం లో ముఖ్య అతిధులుగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్,భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కన్నం యుగదిశ్వర్, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుత మంథని ప్రాంతంలో బీజేపీ పార్టీ రోజు రోజుకు మరింత వ్యాపిస్తుంది, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అసమార్థతను ఎండగడుతూ నిత్యం ప్రజల్లో ఉండాలని గతంతో పోల్చుకుంటే మంథని ప్రాంతంలో బిజెపి పార్టీకి ప్రజాదరణ పెరిగిందని, కష్టపడి పని చేస్తే విజయం మనకు సొంతమని, క్రమశిక్షణ, నిస్వార్ధ సేవ బిజెపి పార్టీకి సిద్ధాంతం రానున్న రోజుల్లో ఈసారి తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి వస్తుందని, బూత్ స్థాయి నుండి పార్టీని మరింత బలోపితం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వినర్ మల్కామోహన్ రావ్,కో కన్వీనర్ నాంపల్లి రమేష్, బియస్ఎ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్,పెద్దపల్లి పార్లమెంట్ ఐటీ సెల్ కన్వీనర్ బీమరాపు సంపత్, అన్ని మండలాల అధ్యక్షులు, ఇంచార్జ్ లు, సీనియర్ నాయకులు పాల్గొన్నరు.