Saturday, July 27, 2024
Homeతెలంగాణఅర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలి

బీఎస్పి పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ మొలుమూరి చంద్రశేఖర్

పెద్దపల్లి,మే15(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపుమేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించాలని సోమవారం పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చేస్తున రిలే నిరాహార దీక్షకు బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ జర్నలిస్టులకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు జిల్లా ఇంచార్జ్ మొలుమూరి చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు లేదా ఇండ్ల స్థలాలు కేటాయిస్తానని స్థానిక ఎమ్మెల్యే 2020 లో ఇండ్ల స్థలాల కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందిి. హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ భూమిని కొందరు వ్యక్తులు చదును చేయించి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, జర్నలిస్టులకు సొంత ఇల్లు లేక కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ఇండ్ల స్థలాల గురించి చేపట్టే ఏ కార్యక్రమం కైనా బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కోశాధికారి ఎండి రియాజ్ ,మాజీ అధ్యక్షులు బొంకురి సాగర్, మాజీ ప్రధాన కార్యదర్శి బొంకురి అన్వేష్, కరట్లపల్లి రజనీకాంత్, కంఠాల నరేష్ ,గుడికందుల సాయి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!