పారిశుద్ధ కార్మికులకు గొడుగుల పంపిణీ .
ఎలిగేడు,మే15(కలం శ్రీ న్యూస్):
మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుంద రెడ్డి 74వ జయంతి సందర్భంగా సోమవారం ఎలిగేడు మండల కేంద్రంలోని నారాయణ పల్లి గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ఆయన అభిమానులు గొడుగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎలిగేడు మాజీ ఎంపిటిసి కరివేద సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని ముఖ్యంగా సబ్ స్టేషన్లు, సిసి రోడ్లు, మినీ కలెక్టరేట్లు ఆయన హయాంలోనే ప్రారంభించబడ్డాయని, ఆయన లేని లోటు స్పష్టంగా కనబడుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో గీట్ల అభిమానులు తాటి పెళ్లి సతీష్ బాబు, కాసర్ల రాజు రెడ్డి, లచ్చయ్య ,రామస్వామి గాదే అంజిరెడ్డి చింత రెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.