Saturday, July 27, 2024
Homeతెలంగాణఐకేపి,విఓఎ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దత్తు తెలిపిన బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

ఐకేపి,విఓఎ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దత్తు తెలిపిన బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

ఐకేపి,విఓఎ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దత్తు తెలిపిన బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

మంథని మే 15(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం ఎం ఆర్ ఓ ఆఫీస్ ముందు నిరవధిక దీక్ష చేపట్టిన ఐకేపి విఓఏ ల కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డిసోమవారం మద్దతు తెలపడం జరిగింది. వారి సమస్య లపై ప్రభుత్వం తో పోరాడాలని సునీల్ రెడ్డి కి వారు వినతిపత్రం అందించడం జరిగింది.అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు సీఎం కెసిఆర్ విఓఏ లకు 10000 గౌరవ వేతనం ఇస్తామని అన్నారు. తెలంగాణ లో కాంట్రాక్టు అనే మాట వినపడవద్దు అని మాట్లాడిన కెసిఆర్ కి రాష్ట్రము లో కాంట్రాక్టు ఉద్యోగస్తులు కనిపించడం లేదా, 2009 లో మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు విఓఏ లను మిమ్మల్ని ఎవరు ఉద్యోగంలో నియమించరాని అవహేళనగా మాట్లాడారు. మహిళ సాధికారత అని గొప్పలు చెప్పుకొని తిరిగే నాయకులకు ఈ మహిళలలు కనిపించడం లేదా? విఓఏ ల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఐకెపి విఓఏ ల సమస్యలు పరిష్కరించాలని చాలా రోజులుగా దీక్ష చేస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు ఐకెపి వివోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని 10 లక్షల సాధారణ బీమా ఆరోగ్య బీమా కల్పించాలని సేర్ఫ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాలు వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని ఎస్ హెచ్ జి విఏ లైవ్ మీటింగ్స్ రద్దు చేయాలని అర్హులైన విఓఏ లను సిసి లుగా ప్రమోషన్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మీరు చేసే ఎటువంటి కార్యక్రమాలకు మద్దతుగా బిజెపి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని సునీల్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, బియస్ఎ నియోజకవర్గ ఇన్చార్జ్ చిలువెరి సతీష్, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, ముత్తారం మండల ఇంచార్జ్ పోతారవేని క్రాంతికుమార్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లికార్జున్, బూడిద తిరుపతి, బోసెల్లి శంకర్, పట్టణ ఉప అధ్యక్షులు దాసరి శ్రవణ్, యువ నాయకులు కురుమ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!