Wednesday, September 18, 2024
Homeతెలంగాణసీఎం కప్ -2023 క్రీడా పోటీలను ప్రారంభించిన రామగిరి ఎంపీపీ - ఆరెళ్ళి దేవక్క కొమురయ్య...

సీఎం కప్ -2023 క్రీడా పోటీలను ప్రారంభించిన రామగిరి ఎంపీపీ – ఆరెళ్ళి దేవక్క కొమురయ్య గౌడ్

సీఎం కప్ -2023 క్రీడా పోటీలను ప్రారంభించిన రామగిరి ఎంపీపీ – ఆరెళ్ళి దేవక్క కొమురయ్య గౌడ్

మంథని మే15(కలం శ్రీ న్యూస్):రామగిరి మండలంలోని గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ -2023 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.రామగిరి మండలం రాణి రుద్రమదేవి స్టేడియం లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ – 2023 మండల స్థాయి క్రీడా పోటీలను రామగిరి ఎంపీపీ ప్రారంభించారు.

ఈ సందర్బంగా రామగిరి ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారి నైపుణ్యాన్ని వెలికితీయాలానే ఉద్దేశ్యంతో సీఎం కప్ 2023 కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ముందుగా మండల స్థాయిలో మూడు రోజులపాటు అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన జట్లను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడా ప్రతిభ కనబరిస్తే రాష్ట్ర స్థాయిల్లో అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. గ్రామీణ క్రీడాకారులకు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు సీఎం కప్ చక్కటి వేదిక అవుతుందని అన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్ సాయినాథ్, ఎస్ఐ కటికే రవిప్రసాద్, తహశీల్దార్ రామ్మోహన్, ఎంపిడిఓ ఇనుముల రమేష్, ఎంపిఓ కే. భాస్కర్, పెట్ సమ్మయ్య, వైద్య సిబ్బంది, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!