Thursday, June 13, 2024
Homeతెలంగాణమాతాశిశు హాస్పిటల్ లో కూలర్లు ఏర్పాటు చేసి ప్రారంభించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌. 

మాతాశిశు హాస్పిటల్ లో కూలర్లు ఏర్పాటు చేసి ప్రారంభించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌. 

మాతాశిశు హాస్పిటల్ లో కూలర్లు ఏర్పాటు చేసి ప్రారంభించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌. 

మంథని మే 15(కలం శ్రీ న్యూస్):ఎండ తీవ్రతతో ఆస్పత్రిలో కాన్పు అయిన పేదింటి బిడ్డలు అవస్థలు పడుతుంటే మన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకోలేదని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.మంథనిలోని మాతా శిశు ఆస్పత్రిలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కూలర్‌లను ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు ఆస్పత్రిలో ఈనాడు కాన్పు కోసం వచ్చిన వారిలో ఐదుగురు బీసీ,నలుగురు ఎస్సీ, ఒకరు మైనార్టీ బిడ్డలే ఉన్నారని, ఈ ఆస్పత్రిని ఎక్కువగా అట్టడుగు వర్గాలే ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. అయితే అట్టడుగు వర్గాలకు సేవలు అందించే ఆస్పత్రికి ఎమ్మెల్యేకు పట్టింపు లేకుండాపోయిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆకలి తెలియని వాళ్లకు అధికారం ఇవ్వబట్టే ఇన్నిఇబ్బందులు పడుతున్నామని అన్నారు.

40ఏండ్లుగా బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలు ఓట్లువేసి కుర్చీల్లో కూర్చోబెట్టితే మన కష్టాలు,మన ఆకలి గురించి పట్టించుకోకుండా తమ కుటుంబం,తమ వాళ్లు అంటూ స్వార్థంగా ఆలోచన చేస్తున్న దుద్దిళ్ల కుటుంబం అమెరికా, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి పట్టణాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని, అధికారం ఇచ్చిన మనం మాత్రం ఇక్కడ ఇన్ని అవస్థలు పడుతున్నామని, ఇందుకు మాతాశిశు కేంద్రమే నిదర్శనమన్నారు. ఈనాడు శ్రీపాద ట్రస్టు చైర్మన్‌ పేరుతో చెలామణిఅవుతూ ప్రచారం చేసుకుంటున్నవాళ్లు అసలు ట్రస్టు ఎక్కడ ఉంది, ఎక్కడ సేవలు అందిస్తుందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో వచ్చి ఎన్నికల తర్వాత ట్రస్టు చైర్మన్‌గా చెలామణి అవుతున్నారని, ట్రస్టు చైర్మన్‌గా ఏనాడైనా ఆస్పత్రులను సందర్శించి పేదలకు సాయం చేయాలని ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. దుద్దిళ్ల కుటుంబానికి వత్తాసు పలికే ఎస్సీ, బీసీ నాయకులు ఇకనైనా ఆలోచన చేయాలని, ట్రస్టు చైర్మన్‌గా పేదోడికి సేవ చేయాలని ప్రశ్నించాలని ఆయన హితవుపలికారు. ఆస్పత్రిలోని ఆడబిడ్డలకు సేవలు చేయడం అటుంచితే కాంట్రాక్ట్‌ పనిచేసుకుని బతికే మైనార్టీ బిడ్డల నోట్లోమట్టి కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వాపోయారు. మైనార్టీ బిడ్డలు కాంట్రాక్ట్‌ తీసుకున్న వాటర్‌ పైప్‌లైన్‌లను కట్‌చేసి ఆస్పత్రిని, కాంట్రాక్ట్‌చేస్తున్నవారిని, ప్రభుత్వాన్నిబదనాం చేసేందుకు కుట్రలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. విపరీతమైన ఎండలు కాస్తున్న క్రమంలో ఆస్పత్రిలో కాన్పు అయిన ఆడబిడ్డలు, చంటి బిడ్డలు ఎలా ఉంటారని ఏనాడైనా ఎమ్మెల్యే ఆలోచన చేశాడా అని ప్రశ్నించారు. మనపై ప్రేమలేదని, కేవలం ఓట్లు యంత్రాలుగానే చూసే వాళ్లకు మన కష్టాలు ఏం తెలుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. 40ఏండ్లుగా ఈ ప్రాంతంలో ఒక్క కుటుంబమే అనేక పదవుల్లో కొనసాగినా కనీసం పేదోడికి సాయం మాత్రం చేయలేదన్నారు. మన ఓట్లతో గెలిచి రూ.2.75లక్షల జీతం తీసుకుంటూ రెండు రూపాయల సాయం చేసిన దాఖలాలు లేవన్నారు. కానీ ఈ మట్టిలో పుట్టిన బిడ్డలు మాత్రమే మనకు సాయం చేస్తారని,మన గురించి ఆలోచిస్తారని మరోసారి రుజువైందని, ఆనాడు ఆస్పత్రిలో కాన్పు అయిన ఆడబిడ్డల కోసం ఏసీలు పెట్టించామని,ఈనాడు మాతా శిశు ఆస్పత్రిలో ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న వారి కోసం పుట్ట లింగమ్మ ట్రస్టుద్వారా కూలర్లు ఏర్పాటుచేశామన్నారు.ఆనాడు వరదల్లో ఆస్పత్రి మునిగిపోయి పరికరాలు చెడిపోతే కనీసం సాయం చేయాలని చూడని వాళ్లు ఈనాడు ఆస్పత్రిని అబాసుపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు. వరదలు వచ్చి ఇబ్బందుల్లో ఉంటే తామే ముందుకు వచ్చి అన్ని వసతులు మెరుగుపర్చి అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన గుర్తుచేశారు. మన ఆకలి, కష్టాల గురించి ఆలోచన చేసే నాయకుడు ఉండాల్సిన అవసరం ఉందని, ఆ దశగానే ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఆపద వస్తే అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు అక్కరకు రాని నాయకుడు ఎవరో గమనించాలన్నారు. ఆనాడు మంత్రిగా ఉన్నసమయంలో దోచుకున్నసొమ్ముతో బంగ్లాలు, భవంతులు, ఆలయాలు కట్టుకున్నారే కానీ అందులోంచి రూపాయి సాయం పేదోడికి చేశారా అని ఆయన ప్రశ్నించారు. స్వప్రయోజనాల గురించి ఆలోచన చేసే వారికి అధికారం అప్పగిస్తే అవస్థలు తప్పవనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!