క్రీడాస్పూర్తితో ముందుకు సాగాలే
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని మే 15(కలం శ్రీ న్యూస్):ప్రతి క్రీడాకారుడు క్రీడాస్పూర్తితోనే ముందుకు సాగాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.సోమవారం మంథనిలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి కప్ 2023 క్రీడాపోటీలను ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు, క్రీడాకారులను గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. ఎంతో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించకపోవడంతో క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోయిందన్నారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడాకారులతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహం అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. క్రీడాకారుల్లోని క్రీడానైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేలా ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిభను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వడం బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటమిలను స్పిరిట్‌గానే స్వీకరించాలని ఆయన సూచించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా క్రీడాకారులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని, వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్బంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పలు పోటీలను ఆయన లాంచనంగా ప్రారంభించారు.