బీపి మండల్ విగ్రహావిష్కరణ విజయవంతం చేయండి
– మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని మే 15(కలం శ్రీ న్యూస్):బీపి మండల్ విగ్రహావిష్కరణ విజయవంతం చేయలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పిలుపునిచ్చారు. సోమవారం జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు పాత్రికేయులకు తెలిపిన ప్రకటనలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారి బీపీ మండల్ విగ్రహావిష్కరణ జరుగుతుందని, రిజర్వేషన్ల కోసం పోరాడిన మహనీయుని తలుచుకోవడం చాలా ఆనందకరమైన విషయమని, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ బీపి మండల్ విగ్రహావిష్కరణ చేయాలనుకోవడం ఎంతో గొప్ప నిర్ణయమని,చరిత్రను మరిచిపోవద్దని మహనీయులను గుర్తుకు తెచ్చుకొని వారు చూపించినటువంటి బాటలో నడుస్తూ వారి ఆశయాలు సాధించాలని అప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు తెలిపారు.బీపీ మండల్ విగ్రహావిష్కరణలో మంథని నియోజకవర్గంలోనీ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,పార్టీ ప్రతినిధులు,కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.