Saturday, July 27, 2024
Homeతెలంగాణజర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి:టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి:టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి:

టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

మద్దతు తెలిపిన వివిధ పార్టీల,జర్నలిస్టుల నాయకులు

పెద్దపల్లి,మే15(కలం శ్రీ న్యూస్):తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇండ్ల స్థలాలు అందించాలనే డిమాండ్ తో సోమవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వివిధ జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పొగుల విజయ్ కుమార్, సుంక మహేష్ లు మాట్లాడుతూ సమాజహితమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు అందిస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. కానీ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇంటి స్థలాల కేటాయింపు జరగడం లేదని అన్నారు.అనేక ఏండ్ల నుంచి జర్నలిస్టులు అద్దె ఇండ్లలో ఉంటూ అద్దె కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని,ఇంటి స్థలాల విషయమై అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు కూడా పలుమార్లు వినతిపత్రాలు అందించామని అన్నారు.

జర్నలిస్టుల సమస్యల పోరాటానికి సంపూర్ణ మద్దతు

జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసే ప్రతి ఒక్కరికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి చింతకింది చంద్రమౌళి, నారాయణదాసు అశోక్ లు అన్నారు.సోమవారం టిడబ్ల్యుజేఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరుపున సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టిడబ్ల్యుజేఎఫ్ పోరాటం చేయడం అభినందనీయమని అన్నారు.సంఘాలకు అతీతంగా జర్నలిస్టులంతా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ దీక్ష కు బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ, డి.ఎస్.పి పార్టీ జిల్లా కన్వీనర్ గణేష్, జిల్లా కో కన్వీనర్ న్యాతరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు టి పి సి సి ప్రధాన కార్యదర్శి ఈర్ల కొమురయ్య, బి.ఎస్.పి పార్టీ జిల్లా నాయకులు పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జ్ ఎమ్ చంద్రశేఖర్, కోశాధికారి ఎండి రియాజ్, బొంకూరి అన్వేష్ లు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్,రాష్ట్ర కార్యదర్శి బిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఫణి సుదర్శన్,ఉపాధ్యక్షులు బోయిని వినోద్,తిరుపతి రెడ్డి, సాబీర్ పాషా,వీరేశం,సుంక శ్రీధర్,రవి,రమేష్,గోపి క్రిష్ణ, చంద్రమౌళి, సతీష్ ,దేవేందర్, సుమన్, పరమేష్,తిరుపతి, శ్రీనివాస్ లతో పాటు అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!