మంత్రిని విమర్శిస్తే సహించేది లేదు… వెల్గటూర్ మండల బి.ఆర్.ఎస్ నాయకులు
వెల్గటూర్, మే 15( కలం శ్రీ న్యూస్)ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ను విమర్శిస్తే సహించేది లేదని మండల తెరాస నాయకులు హెచ్చరించారు. ఆదివారం వెల్గటూర్ మండల సిసి రోడ్లు,డ్రైనేజీల నిర్మాణం, హైమాక్స్ లైట్లు ఏర్పాటు, కమిటీ హాళ్లు ఇవన్నీ మీ కళ్ళకు కనిపించట్లేదా అని ఎద్దేవా చేశారు. వెల్గటూర్ అభివృద్ధికి కొప్పుల ఈశ్వర్ ఎంతగానో కృషి చేశారని, మీ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తులకు కేంద్రంలో తెరాస పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు పత్తిపాక వెంకటేష్, పెద్దూరి భరత్, జూపాక కుమార్ మాట్లాడుతూ.. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లురి లక్ష్మణ్ కుమార్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై లేనిపోని ఆరోపణలు చేయడం. రాజకీయ ఉనికి కోసమేనని ఆరోపించారు. వెల్గటూర్లో అభివృద్ధి కుంటుపడిందని అనడం హాస్యాస్పదంగా ఉందని, వాడవాడలో నష్టపరిహారం, ఈతవనాలకు భూమి ఇప్పిం చడం, బెస్త కులస్తులకు డబ్బులివ్వడం,సీఎం రిలీఫ్ ఫండ్.. ఇలా ఎన్నో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న మంత్రిపై లేనిపోని ఆరోపణ చేస్తే సహించమని అన్నారు. మీ రాజకీయం ఏదో మీరు చేసుకోండి. అంతే కానీ రాజకీయ లబ్ధి కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం తపనపడే మా నాయకుడిపై నోరు జారితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కార్యక్రమంలో రామస్వామి, రత్నాకర్, కొప్పుల విద్యా సాగర్, సత్యం, తిరుపతి, అశోక్, సనిల్, బిడారి తిరుపతి, సురేష్, ఎల్లయ్య, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.