Monday, May 27, 2024
Homeతెలంగాణప్రజల కష్టాలు తీర్చారు కనుకనే ఒకే కుటుంబానికి 40 సంవత్సరాలుగా పట్టం కట్టారు

ప్రజల కష్టాలు తీర్చారు కనుకనే ఒకే కుటుంబానికి 40 సంవత్సరాలుగా పట్టం కట్టారు

ప్రజల కష్టాలు తీర్చారు కనుకనే ఒకే కుటుంబానికి 40 సంవత్సరాలుగా పట్టం కట్టారు

మంథని, మే 14(కలం శ్రీ న్యూస్):  రాజ గృహలో ఏర్పాటుచేసిన ఇటీవల విడుదలైన ఇంటర్, పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో దుద్దిళ్ళ కుటుంబంపై పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు సేగ్గం రాజేష్, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశి భూషణ్ కాచే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని సంకల్పంతో అనేక పాఠశాలలు కళాశాలలు స్వర్గీయ శ్రీపాద రావు, శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో అనేక కళాశాలలు ఏర్పాటుచేసి బడుగు బలహీన వర్గాలను విద్యా కుసుమాలుగా మార్చిన ఘనత దుద్దిళ్ళ శ్రీధర్ బాబుది.నాలుగు సంవత్సరాల ఎమ్మెల్యే కాల హాయంలో రెండు లక్షల 75 వేల రూపాయలకే వెంకటాపూర్ గ్రామంలో ఫామ్ హౌస్, అనేక ఎకరాల భూములు,రాజభవనాలు ఎలా నిర్మించావో ప్రజలందరికీ తెలుసు.శ్రీనుబాబు చదువుకున్న వ్యక్తి కాబట్టే విద్యార్థుల ఇంటివద్దకే వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నీలాగా రాజాగృహలకు పిలిపించుకొని సన్మానాలు చేయలేదు.చదువుకున్న వ్యక్తి కాబట్టి చదువుకునే వారిని ఎలా గౌరవించాలో వారికి తెలుసు.ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా స్వర్గీయ శ్రీ పాద రావు విగ్రహాలను ఏర్పాటు చేస్తే తప్పేముంది ప్రాంత ప్రజల అభివృద్ధి శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి శ్రీపాదరావు ఆనాడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు విగ్రహాలు పెట్టాలని హడావిడి చేసిన వ్యక్తి నీవు కాదా ఎప్పటికీ లింగమ్మ పుట్ట తల్లి పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. నికు దమ్ము ఉంటే నీ తండ్రి విగ్రహం మంథని లో పెట్టు. ఎందుకు నువ్వు నీ తండ్రి గురించి చెప్పుకోవడం లేదు.100 ఇందిరమ్మ ఇల్లు చూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పిన పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మంథని మండలం ధర్మారం గ్రామంలో చూపిస్తే ఎందుకు ఆ సవాలు స్వీకరించడం లేదో ఎంత సత్య హరిచంద్రడో అర్దం అవుతుంది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు కాబట్టే 40 సంవత్సరాలుగా వాళ్లకు పట్టం పడుతున్నారు. నువ్వు బీసీ బిడ్డవై ఉండి కూడా నిన్ను నాలుగు సంవత్సరాలకే తరిమి కొట్టారంటే ఎవరు కష్టాలు తీర్చిన కుటుంబము ఎవరు నష్టాలు తెచ్చిన కుటుంబము ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని చౌకబార్ విమర్శలు చేస్తే కోరుకునేది లేదని అన్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గత మూడు ,నాలుగు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా సింగిల్ విండో చైర్మన్ లు జాయింట్ కలెక్టర్ ను కలిసి ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి అని మేము మాట్లాడాము దానికి మా మదన్న కూడా ఉన్నాడు అని చెప్పుకుంటున్న సింగిల్ విండో చైర్మన్ లు 40 కేజీ లు పెట్టవలసిన ధాన్యం బస్తాను 42,43 కేజీలు పెట్టి అక్కడ మిల్లర్లు దించుకోవడంలేదని సెంటర్ నిర్వాహకులు చెపుతున్నారు.

సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగమంతా తడిసిన, రంగు మారిన, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే పెద్దపెల్లి జిల్లాలో మాత్రం ఆదేశాలు పెద్దపెల్లి జెడ్పి చైర్మన్ తో అమలు కావడం లేదు. విద్యార్థులకు పుట్ట లింగమ్మ సేవ పేరుతో రైస్ మీల్లర్లు చేసిన పదిలక్షల సాయం కారణంగా ముఖ్యమంత్రి ఆదేశించిన కూడా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయకపోయినా కనీసం వాళ్లను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ ఒత్తిడి చేయడం లేదు.పెద్ద పల్లి జడ్పీ చైర్మన్ మద్దతు రైస్ మిల్లర్ల కా రైతులకా రైతులను యేదెచ్చగా దోచుకుంటున్నా రైస్ మిల్లర్ ల్లు

10 లక్షల రూపాయల విలువగల బియ్యాన్ని పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు విరాళంగా అందజేశారు.అధికార ఆహంతో అధికారులను ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారు.మరి రైస్ మిల్లర్లను ఎందుకు బెదిరించడం లేదు ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అందరూ చిన్న కారు సన్న కారు బడుగు బలహీన వర్గాల రైతులే కదా ఎందుకు నీ బహుజనవాదం అన్నారు. పదిలక్షల సహాయాన్ని పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు చేశారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో పోలు శివ, వోడ్నన శ్రీనివాస్,పేరవెని లింగయ్య యాదవ్, ముస్కుల సురేందర్ రెడ్డి, గోటికరీ కిషన్ జీ, రావికంటి సతీష్, అజీమ్ ఖాన్,మంథని రాకేష్, పేంటరి రాజు,మంథని సురేష్,బండారి ప్రసాద్,ఆర్ల నాగరాజు,నాగుల రాజయ్య, దోర గొర్ల శ్రీనివాస్ యాదవ్, అక్కపాక సదయ్య,పెరుగు తేజ, పల్లె రవి, ఐసన్ ,అరెళ్లి కిరణ్, ఇందారపు అనిల్, పంచిక దేవేందర్,నితీష్, గువ్వల ప్రశాంత్,ఎరుకల సాయి మోహన్ తదతరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!