మంత్రప్రురి ట్రస్ట్ సహాయం
మంథని,మే 14 (కలం శ్రీ న్యూస్): మంత్రపురి ట్రస్ట్ ఉదారత స్వభావం చాటుకుని నిరుపేద పెళ్లికి సహాయం చేశారు. ఆదివారం మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన పల్ల శ్రీనివాస్ అనే నిరుపేదకు మంత్రపురి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాసరి మొగిలి అలియాస్ కోటయ్య కనీస అవసరాలైన పెళ్లి బట్టలు, వంట సామాగ్రి బహుకరించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి అల్లం తిరుపతి, సభ్యులు దుబ్బాక ఓదెలు, మాచిడి శంకర్, మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్ పాల్గొన్నారు.