రిలే నిరాహార దీక్ష విజయవంతం చేయండి
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలి
టి డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు పోగుల విజయ్ కుమార్ ,సుంక మహేష్
పెద్దపల్లి,మే14(కలం శ్రీ న్యూస్):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర పిలుపుమేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించాలని సోమవారం పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరగబోయే రిలే నిరాహార దీక్షకు జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్, ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం రోజు పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టే రిలే నిరాహార దీక్షను పెద్దపల్లి జిల్లాలోని జర్నలిస్టులో అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇల్లు లేదా ఇండ్ల స్థలాలు కేటాయించాలని లేని పక్షాన జిల్లాలో ఆందోళనలు చేపడతామని అన్నారు. సొంత ఇల్లు లేక కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.