మంథనిలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
మంథని మే 13(కలం శ్రీ న్యూస్):మంథని అంబేడ్కర్ చౌరస్తాలో ఏఐసీసీ కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరించి 2023 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా శనివారం మంథని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం లో మోడీ,రాష్ట్రం లో కెడి నియంతృత్వ పరిపాలనకు అంతం ఆరంభమైందని,ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.