Friday, September 20, 2024
Homeతెలంగాణకన్న కూతురిని చంపిన కేసులో నిందుతున్ని అరెస్ట్ చేసిన మంథని పోలీసులు

కన్న కూతురిని చంపిన కేసులో నిందుతున్ని అరెస్ట్ చేసిన మంథని పోలీసులు

కన్న కూతురిని చంపిన కేసులో నిందుతున్ని అరెస్ట్ చేసిన మంథని పోలీసులు

మంథని మే 12(కలం శ్రీ న్యూస్):రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం మంథని సి.ఐ నిందితుని అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది.నిందితుని వివరాలు గుండ్ల సదయ్య s/o సీతయ్య వ 35 సం.లు వృత్తి.కూలీ బట్టుపల్లి గ్రామం మంథని మండలం.నిందితుని నుండి చంపడానికి ఉపయోగించిన గొడ్డలి స్వాధీనం చేసుకొన్నారు.వివరాల్లోకి వెళితే మంథని మండలం బట్టుపల్లిలో తేదీ 11.05.2023 రోజున గుండ్ల సదయ్య అనే వ్యక్తి తన కన్న కూతురైన రజిత 10 సంవత్సరాల బాలికను గొడ్డలి తో నరికి చంపి తదుపరి అదే గ్రామానికి చెందిన ధూపం శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా గుడ్డలితో దాడి చేయడం జరిగింది అనే సమాచారం అందిన వెంటనే మంథని సీఐ సతీష్ సంఘటన స్థలానికి వెళ్లి నిందితుడుని అదుపులో తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలిచడం జరిగింది.గుండ్ల సదయ్య, తండ్రి పేరు సీతయ్య,వయసు 35 సంవత్సరాలు,కులం ఎస్టి నాయకపు,ఇతను కూలి పని చేసుకుని జీవిస్తూ ఉంటాడు, ఇతని భార్య పేరు శ్రీలత తేది 04-09 -2022 రోజున కుటుంబ కలహాల మూలంగా తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది, తదుపరి గుడ్ల సదయ్య తన యొక్క పిల్లలైనా గుండ్ల అంజి మరియు రజితతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడు. నిందితుడు ఏం పని చేయక ఇంట్లోనే కాలిగా ఉంటూ, తన కొడుకు అంజి ట్రాక్టర్ డ్రైవర్ చేస్తే వచ్చే కూలీ డబ్బులను తను మందు త్రాగడానికి మరియు ఇతర అవసరాలకు వాడుకుంటుండె వాడు,ఇదే క్రమంలో తండ్రికి ఇద్దరు పిల్లలకి మనస్పర్ధలు రావడంతో గుండ సదయ్య అప్పుడప్పుడు వాళ్లను బెదిరించేవాడు.తన కొడుకు అంజి తనకు అవసరాలకు డబ్బులు అడుగుతే ఇవ్వట్లేదని మనసులో పెట్టుకొని, కొడుకు అంజి పని మీద బయటకు వెళ్లగా, తన కూతురు రజితను తన ఇంట్లోనే ఉదయం 9.30గం.ల సమయంలో గొడ్డలితో తలపై మరియు ఇతర భాగాలపై బలంగా నరుకగా అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయానికి అక్కడికి వచ్చిన కొడుకు తన తండ్రి చేతిలో గొడ్డలి చూసి భయపడినాడు. అదే గొడ్డలి తీసుకొని సదయ్య అదే గ్రామానికి చెందినటువంటి ధూపం శ్రీనివాస్ అనే వ్యక్తి యొక్క కిరణం షాపుకు వెళ్లి మందు తాగడానికి మందు ఇవ్వమని అడిగితే ఇవ్వలేదని దాని విషయంలో అతనిని కూడా అదే గొడ్డలి తో శ్రీనివాస్ ముఖంపై కొట్టగా తీవ్ర రక్త గాయాలు అయినవి.మృతురాలు మేనమామ ఇచ్చినా పిర్యాదు మేరకు నిందుతునిపై కేసు నమోదు చేసినాము,అదే విధంగా కిరాణ షాప్ ఓనర్ అయినా దూపం శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదు పై కూడా హత్యయత్నం కింద కేసు నమోదు చేయడం జరిగినది. విచారణ అనంతరం నిందుతున్ని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

నిందితుడు గతం లో బట్టుపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రాజేష్ అనే వ్యకిపై దాడి చేసిన సంఘటనలో కూడా కేసు నమోదు అయినది.

నిందితుడిని పట్టుకోవడంలో , నేర పరిశోధనలో చాకచక్యంగా వ్యవహరించిన మంథని ఎస్సై వెంకటేశ్వర్, రామగిరి ఎస్సై రవి ప్రసాద్,ఏఎస్ఐ మల్లయ్య, హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణ నాయక్, కానిస్టేబుల్స్ సురేందర్ కిరణ్, కోర్ట్ కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు మురళి, శ్రీహరి లను సి.ఐ సతీష్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!