చికెన్ సెంటర్ షాప్ ను సీజ్ చేసిన మున్సిపల్ కమిషనర్
సుల్తానాబాద్,మే11(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణం లో పలు చికెన్ సెంటర్ లని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూసల రోడ్ లోని గౌస్ చికెన్ సెంటర్ వద్ద నిలువ ఉంచిన చికెన్ వ్యర్ధాలను వెంటనే తొలగించాలని, ఎటువంటి దుర్గంధం రాకుండా షాప్ యజమానులు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. ఇష్టానుసారంగా వ్యర్ధాలను రోడ్లపై పారవేయడం గాని చేస్తే జరిమానాలు విధిస్తామని ఈసందర్భంగా తెలియజేస్తూ, గౌస్ చికెన్ సెంటర్ వద్ద తీవ్రమైన దుర్గంధం, అధిక మొత్తం లో వ్యర్ధాలు నిలువ వుంచి నందున షాప్ ని సీజ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది శ్రావణ్ పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ చికెన్ సెంటర్ లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టినందుకు పలువురు హర్షం వ్యక్తం చేశారు.అలాగే ప్రతి రోజూ సాయంత్రం పట్టణం లోని పలు చికెన్ సెంటర్ లను నుండి చికెన్ వ్యర్థాలను ట్రాలీ లా ద్వారా సేకరించే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.