తాటి చెట్టునుండి పడి గీతా కార్మికునికి తీవ్ర గాయాలు. మంథని మే 11(కలం శ్రీ న్యూస్): మంథనిలో గురువారం మధ్యాహ్నం తాటి శ్రీనివాస్ గౌడ్ అనే గీతా కార్మికుడు కల్లు తీయడం కొరకు తాటి చెట్టు ఎక్కగా తాడిచెట్టు పైనుండి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి.స్థానిక గీతాకార్మికులు 108 వాహనంలో మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కొరకు గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు.