Saturday, July 27, 2024
Homeతెలంగాణవిద్యార్థులను సన్మానించిన సెయింట్ మేరిస్ మేనేజ్ మెంట్ - స్టాఫ్ 

విద్యార్థులను సన్మానించిన సెయింట్ మేరిస్ మేనేజ్ మెంట్ – స్టాఫ్ 

విద్యార్థులను సన్మానించిన సెయింట్ మేరిస్ మేనేజ్ మెంట్ – స్టాఫ్ 

సుల్తానాబాద్,మే10(కలం శ్రీ న్యూస్) : సెయింట్ మేరీస్ మేనేజ్ మెంట్, స్టాఫ్ పడ్డ కష్టానికి ఫలితం దక్కించిన విద్యార్థులను పాఠశాల మేనేజ్ మెంట్, స్టాఫ్ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫాదర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఎంతో శ్రద్ధతో రాత్రీ,పగలు తేడా లేకుండా అధ్యాపకులు విద్యను నేర్పించిన అధ్యాపకుల శ్రమకు పూర్తి స్థాయి లో ఉతీర్ణత సాధించి ముందు వరుసలో నిలిపి నందుకు అధ్యాపకులతో పాటు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 10/10 సాధించిన ఐత్రాజ్ పల్లి కి చెందిన రామిడి శ్రీనివాస్ కుమార్తె శ్రీహరికను శాలువా కప్పి పుష్ప గుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం 9.8 సాధించిన శ్యామ్ ప్రీతమ్,ఏ. హర్ష, 9.7సాధించిన జి.అభిషేక్, 9.5 సాధించిన పి.ప్రణవి లను శాలువాలు, బొకే లు అందించి సన్మానించారు. ఈ.పూజ,కార్తికేయ,అనిల్కుమార్,హర్షిత,త్రినయని,లిఖిల్,శరత్,తేజస్విని,రాహుల్ ప్రిన్స్,అభినయ,భూమిక,అభిరాం,అభినయ,అక్షిత,శివమణి,సిద్దార్థ,వివేక్,అనన్య,స్ఫూర్తి,రోహిత్,వర్షిత్,తనుశ్రీ మాలిక్,ప్రణయ్,ఉమేష్ చెంద్ర,కృష్ణ,మణిదీప్,శ్రీజ,శివ సాయి,రాకేష్,సతీష్,శ్రీరామ్ లను అందరిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదివి, అత్యున్నత స్థాయి లో నిలవాలని ఆశీర్వదించారు. ఉన్నఊరు, కన్న తల్లి, విద్యనేర్పిన గురువులను మర్చిపోకుండా, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ తుమ్మ అశోక్ రెడ్డి స్థానికంగా లేకపోవడంతో ఫోన్ ద్వారా అభినందనలను తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల సిబ్బంది, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!