పలు వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్
పెద్దపల్లి,మే10(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేట (ధర్మబాజు) గ్రామనికి చెందిన గాజుల రమేష్ కూతురు పూజిత వివాహానికి, ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన నాగులమల్యాల శంకరయ్య కూతురు హేమలత వివాహానికి ఆర్థిక సహాయం అందించాలని స్థానిక కేసిఆర్ సేవా దళం నాయకులు, కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ని కోరగా వెంటనే స్పందించి కెసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు, కెసిఆర్ సేవా దళం నాయకుల ద్వారా అందించడం జరిగింది.
అడగగానే స్పందించి వారి కుటుంబాలకు సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, బొద్దుల లక్ష్మణ్ మున్ముందు ప్రజలకు మరెన్నో సేవలను అందించడానికి ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేసీఆర్ సేవా దళం యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, కెసిఆర్ సేవా దళం పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు షేక్ షకీల్,మహ్మద్ రఫి,జిల్లా నాయకులు జెట్టి సతీష్ ,దండె రఘ,బింగి రాజు,అమరగాని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.