Saturday, July 27, 2024
Homeతెలంగాణమంథనిని సుందరీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నం... - -మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ 

మంథనిని సుందరీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నం… – -మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ 

మంథనిని సుందరీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నం… – -మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ 

మంథని మే 9(కలం శ్రీ న్యూస్): ప్రజాప్రతినిధులుగా పేదలకు సేవ చేయాలనే తపన, అభివృధ్ది చేయాలనే ఆరాటం ఉండాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ అన్నారు. మంథని ఫ్రెండ్స్‌క్లబ్‌లో మంథని విద్యార్ధి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండెల మారుతి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అభివృద్ది, సేవకు ఆత్మీయ వందనం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.ఈ సందర్బంగా మంథని మున్సిపల్‌ అభివృధ్దిలో కీలక పాత్రపోషించిన ఆమెను నిర్వాహకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 75ఏండ్ల స్వాతంత్య్రంలో మంథని నియోజకవర్గంలో సింహబాగాన సుమారు 40ఏండ్లకుపైగా పరిపాలన చేసిన గత పాలకులు ఏనాడు మంథని అభివృథ్ది గురించి పట్టించుకోలేదని, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన చేయలేదన్నారు. అధికారం కోసమే ఆరాటపడ్డారే కానీ ప్రజాసమస్యలను పరిష్కరించి అభివృధ్ది బాటలు వేయాలని ఆలోచన చేయలేదన్నారు. ఆనాడు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ఆర్థిక సంస్కరణలతో దేశానికి వెలుగులు ప్రసాదించిన స్వర్గీయ పీవీ నర్సింహరావును కాంగ్రెస్‌నేతలే పట్టించుకోలేదని, ఈ ప్రాంతానికి చెందిన నాయకుడైనా కనీసం గౌరవించాలని ఏనాడు గత పాలకులు ఆలోచించలేదన్నారు. కానీ జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తాను మంథని మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో గొప్పగా ఆలోచన చేసి పాత పెట్రోల్‌ బంక్‌సమీపంలో స్వర్గీయ పీవీ నర్సింహరావు విగ్రహాన్నిఏర్పాటుచేసి ఆయనకు ఎంతో గౌరవం కల్పించిన ఘనత దక్కించుకున్నామని అన్నారు. కేవలం నాలుగేండ్లలో ఎమ్మెల్యేగా పుట్ట మదూకర్‌, సర్పంచ్‌గా తాను మంథనిలో అనేక అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టి రూపురేకలు మార్చామన్నారు. మంథనిని అన్ని రంగాల్లో అబివృధ్ది చేసి సుందరీకరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలని ఆమె ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. అభివృధ్ది, సేవను గుర్తించి ఆత్మీయ వందనం కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్బంగా పలువురు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని ఆమె భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమం లోమున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్ వేముల లక్ష్మి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!