కౌన్సిల్ సభ్యులతో సాధారణ సమావేశం నిర్వహించిన -మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ. మున్సిపల్ కమిషనర్ యు. శారద
మంథని మే 9(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ కు అవసరమగు అంశాలను కౌన్సిల్ సభ్యులతో మంగళవారం చర్చించి ఆమోదం తీసుకున్నారు.మంథని మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది వెతనము 1000 హెచ్చింపు కొరకు ఆమోదము గురించి.మహిళా భవన్ కు సావిత్రి బాయ్ పూలే పేరును పెట్టడం కోసం కౌన్సిల్ సభ్యులతో తీర్మానించ నైనది.మంథని మున్సిపల్ పరిదిలోనీ 10వ వార్డు లో గల హనుమాన్ నగర్ లో నూతన బోర్ వేయించుటకు కౌన్సిల్ సభ్యులతో తీర్మానించ నైనది.ఈ కార్యక్రమములో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్, కౌన్సిలర్లు వీకే రవి,గుండా విజయ లక్ష్మి- పాపారావు, కుర్ర లింగయ్య,నక్క నాగేంద్ర -శంకర్, కాయితీ సమ్మయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, వేముల లక్ష్మి – సమ్మయ్య, కో అప్షన్ సభ్యులు యం.డి యాకుబ్, అంకరి పద్మజా -కుమార్ పాల్గొన్నారు.