విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం ప్రమాణ స్వీకారోత్సవం
పెద్దపల్లి,మే09(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం ఎన్నికలు గత నెల 19 ఏప్రిల్ 2023 రోజున ఏకగ్రీవంగా నూతన అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ కందుకూరి ఈశ్వరచార్యులు, ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మశ్రీ కోటగిరి వేణు మాధవ ఆచార్యులను ఎన్నుకోవడం జరిగింది. మంగళవారం రోజున పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి సిరి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి బ్రహ్మచార్యులు,రాష్ట్ర కోశాధికారి గొల్లపల్లి రామన్నచార్యులు నూతన కార్యవర్గానికి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ అర్చక పురోహితులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.