Saturday, July 27, 2024
Homeతెలంగాణపలు వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్

పలు వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్

పలు వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్

పెద్దపల్లి,మే09(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 14 వార్డ్ నల్లపోచమ్మ వీధికి చెందిన సభీర్ ఖాన్ కూతురు వివాహానికి, అందుగులపల్లి లోని మర్రి రమేష్ కూతురు సౌమ్య వివాహానికి ఆర్థిక సహాయం అందించాలని స్థానిక నాయకులు, కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ని కోరగా వెంటనే స్పందించి కెసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ పోతాని పురుషోత్తం, కెసిఆర్ సేవా దళం నాయకుల ద్వారా అందించడం జరిగింది.

అడగగానే స్పందించి వారి కుటుంబాలకు సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, బొద్దుల లక్ష్మణ్ మున్ముందు ప్రజలకు మరెన్నో సేవలను అందించడానికి ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నాము అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవా దళం పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు షేక్ షకీల్,వార్డు సభ్యులు పుల్లురి రాజేష్,జిల్లా నాయకులు మేరుగు రవీందర్, మీరజ్, సమీర్ ఖాన్, జాఫర్, జెట్టి సతీష్ , పుల్లురి రాజేష్, మారెం రాహుల్, దామ నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!