Saturday, July 27, 2024
Homeతెలంగాణప్రకృతి విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరు రైతులకు సహకరించాలి 

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరు రైతులకు సహకరించాలి 

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరు రైతులకు సహకరించాలి 

సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని, మే 9(కలం శ్రీ న్యూస్):పంటలు చేతికచ్చే సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కోరారు. మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మున్సిపల్ పరిధిలోని మంథని ఏఎంసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు, తరలింపు, దిగుమతి ప్రక్రియలో కీలకమైన పాత్ర పోషిస్తున్న హమాలీలు,లారీ కాంట్రాక్టర్లు, మిల్లర్లు ప్రకృతి విపత్తుల సమయంలో వారివారి విధులు నిర్వహిస్తూ రైతులకు అండగా నిలువాలని సూచించారు.లారీ కాంట్రాక్టర్లు సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపి త్వరితగతిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. అలాగే హమాలీలు కూడా కొంత శ్రమ కోర్చి వెనువెంటనే ధాన్యం కాంటాలు పెట్టి లారీల్లో ధాన్యం లోడ్ చేసి త్వరగా మిల్లులకు వెళ్లేలా చూడాలన్నారు. అదేవిధంగా రైతులు కూడా తమవంతు కర్తవ్యంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం బస్తాల వివరాలు, మిల్లర్లు, లారీల సమస్య లేకుండా చూడాలని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా సహకార అధికారి, డిఎస్ఓల దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించినారు. అలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది కూడా తదనుగుణంగా రైతులకు సహకరించి వారికి ఏ కష్టం కలగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, సింగిల్విండో ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి,సంఘ డైరెక్టర్ లెక్కల కిషన్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ గొబ్బూరి వంశీ, ఎంపిటిసి పెండ్లి చైతన్య-ప్రభాకర్ రెడ్డి, లారీ కాంట్రాక్టర్ రావికంటి సతీష్ కుమార్, కార్యదర్శి ముత్తినేని స్వామి, హమాలీ సంఘం కార్యదర్శి సది, సిఈఓ మామిడాల అశోక్ కుమార్, సూపర్వైజర్ బొద్దుల సమ్మయ్య, రైతులు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!