Sunday, May 26, 2024
Homeతెలంగాణపెండింగ్ లో ఉన్న సర్పంచ్ ల బిల్లులు వెంటనే చెల్లించాలి.

పెండింగ్ లో ఉన్న సర్పంచ్ ల బిల్లులు వెంటనే చెల్లించాలి.

పెండింగ్ లో ఉన్న సర్పంచ్ ల బిల్లులు వెంటనే చెల్లించాలి.

సర్పంచ్ లు బిల్లులు రాక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటే మీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు?

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి..

మంథని, మే 9(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లో ఉన్న సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలకు త్వరగా పరిష్కారం చూపెట్టాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంథని ఆర్.డి.ఓ ఆఫీస్ ముందు చేపట్టిన నిరసన దీక్ష లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకోవడం చాల బాధాకరం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లో ఉంది ఎందుకు? పక్క రాష్ట్రలలో వందల కోట్లు ఎన్నికల ఖర్చు పెట్టె కెసిఆర్ కి మన రాష్ట్ర లో బిల్లు చెల్లించే సోయి లేదా,రాష్ట్రాన్ని అప్పుల కుప్పలగా మర్చి ఇంకా దేశాన్ని ఉద్ధరిస్తాడా? ఈరోజు గ్రామాలలో స్మశానవాటికలు, మరుగుదొడ్లు, రోడ్లు, భవనాలు, డంపింగ్ యార్డ్ లు, అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీలను ఆదుకుంటుంది కేంద్రప్రభుత్వం,కేంద్రం నిధులు మంజూరు చేస్తే రాత్రికి రాతే దొంగ దారిలో నిధులు మల్లించుకున్న నీచమైన బుద్ధి కెసిఆర్ ప్రభుత్వనిధి, మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటె గ్రామపంచాయతీ లకు బిల్లు చెల్లించి, వారి సమస్యలు పరిష్కారం చూపండి, బిల్లు రాక కూలీ పనికి పోతున్న సర్పంచ్ ల జీవితం వర్ణనాతీతం,గత నాలుగు సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ సర్పంచులు గ్రామ అభివృద్ధి కొరకు తమ తమ సొంత డబ్బులతో రైతు వేదికలు, స్మశాన వాటికలు, వీధిలైట్ల నిర్వహణ, డ్రైనేజీ నిర్వహణ, చెత్త ట్రాక్టర్ల నిర్వహణ తదితర అభివృద్ధి పనుల కొరకు తమ సొంత ఖర్చులతో దాదాపు 5 లక్షల నుంచి 40 లక్షల రూపాయల దాకా గ్రామ అభివృద్ధికి అప్పులు తెచ్చి మరి ఖర్చు చేశారు.గత ఏడు నెలల నుండి ఈ ఖర్చుచేసిన డబ్బులకు సంబంధించిన బిల్లులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల తెచ్చిన అప్పుల భారానికి తాలలేక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 15 మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులను ఫ్రీజింగ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలను నిలిపివేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్ల పై నియంత వైఖరిని విడనాడి తక్షణమే గ్రామ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అదే విధంగా ఫ్రీజింగ్ చేసిన ఖాతాలను ఓపెన్ చేయాలని భారతీయ జనతా పార్టీ బిజెపి పక్షన డిమాండ్ చేస్తున్నం లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదురుకోవలసి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ,బిఎస్ఎ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్, మండల ఇంచార్జ్ తోట మధుకర్, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్, ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, ముత్తారం మండల ఇంచార్జ్ పోతారవేణి క్రాంతికుమార్, మండలఉప అధ్యక్షులు బూడిద రాజు, రేపాక శంకర్, సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్, బూడిద తిరుపతి,చీదురాల మధుకర్ రెడ్డి, చేరుకుతోట సురేష్, టి రాజు, కుమారస్వామి,ఎల్క సదానందం,గాడేపు కృష్ణ, అలవేణి సమ్మయ్య, బోసెల్లి శంకర్, మౌనిక, పట్టణ ఎస్ స్సీ మోర్చా అధ్యక్షులు కాసర్ల సూర్య, యువ నాయకులు కురుమ శేఖర్, దసరాపు సంజీవ్,పోడేటి నరేష్, నారా నరేందర్, కాసిపేట రాజేష్, కాపీరం చంద్రశేఖర్, తోట పల్లి లక్ష్మణ్, మార్క శశి కుమార్, ముత్యాల స్వామి, అంబల శశి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!