Tuesday, October 8, 2024
Homeతెలంగాణఅనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ఆర్ధిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్

అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ఆర్ధిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్

అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ఆర్ధిక సహాయం అందించిన బొద్దుల లక్ష్మణ్

జూలపల్లి,మే09(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన గుడెళ్ళి అనూష గత కొన్ని రోజులుగా పేగు కేన్సర్ తో బాధపడుతోంది. ఆమె అన్న గుడెల్లి శ్రీకాంత్ ఇట్టి విషయాన్ని కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ కి వివరించి, చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించాలని కోరగా వెంటనే స్పందించి బొద్దుల లక్ష్మణ్ పది వేల రూపాయలు అందించారు.

ఈ సందర్భంగా బొద్దుల లక్ష్మణ్ అనూష కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, మున్ముందు చికిత్స కోసం మీకు హాస్పిటల్ లో ఏమైనా ఇబ్బంది ఉన్న కూడా నేను సహాయం అందిస్తాను అని అన్నారు. కుటుంబ సభ్యులు గానీ, అనూష గానీ దైర్యాన్ని పోగొట్టుకొకుండా, మంచిగా చికిత్స చేసుకోమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సొల్లు పద్మ శ్యామ్, ఉపసర్పంచ్ చొప్పరి నర్సింహం, చిగురు రవీందర్ రెడ్డి, రాజయ్య, బొద్దుల నారాయణ, సాయినాథ్, చిప్ప శ్రీకాంత్, కనకయ్య, వీరేశం, భూమయ్య, మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల అజిత్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!