నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది
మంథని, మే 8(కలం శ్రీ న్యూస్ ):మంథని ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. సోమవారం భూపాలపల్లి నుండి గోదావరిఖనికి వస్తున్నటువంటి మంథని డిపోకు చెందిన ఆర్టీసీ (టీఎస్ 22 టీఏ 1552) నెంబర్ గల బస్సులో చిల్లపల్లి నుండి గోదావరిఖనికి ప్రయాణిస్తున్నటువంటి పోట్ల పోసయ్య అనే ప్రయాణికుడు రూ. 5. వేలు, ఆధార్ కార్డ్, ఏటీఎం, పాన్ కార్డ్, విలువైన పత్రాలు బస్సులో మర్చిపోగా, బస్ డ్రైవర్ సతీష్, కండక్టర్ చంద్రమౌళి వెనువెంటనే స్పందించి విలువైనటువంటి వస్తువులు, డబ్బులు ఆ ప్రయాణికుడికి అందజేయడం జరిగింది. నిజాయితీ చాటుకున్న సిబ్బందిని అక్కడున్నటువంటి ప్రయాణికులు అభినందించారు. విషయం తెలుసుకున్న మంథని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల చూపిస్తున్నటువంటి నిజాయితీని చూసి గర్వపడ్డారు.