ఆచార్య ఫౌండేషన్ అన్నదానం అభినందనీయం..
పొన్నమనేని బాలాజీ రావు, ఎంపిపి,సుల్తానాబాద్.
సుల్తానాబాద్,మే08(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఆచార్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం అభినందనీయమని సుల్తానాబాద్ ఎంపి.పి పొన్నమనేని బాలాజీ రావు కొనియాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేటి సమాజంలో అంగవైకల్యం కలవారిని నిరాశ, నిస్పృహలకు గురికాకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఆచార్య ఫౌండేషన్ చేపట్టే సామాజిక సేవ కార్యక్రమాల్లో తన వంతు భాగస్వామ్యంతో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. మరొక అతిథి ఎంపీడీవో శశికళ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను తెలియజేసేలా నిర్వహిస్తున్న ఆచార్య ఫౌండేషన్ ద్వారా సమాజములోని అన్ని వర్గాలను ప్రోత్సహించేలా సేవ అందించాలని కోరారు. ఈరోజు ఆచార్య ఫౌండేషన్ సభ్యులు కొమిరిషెట్టి లావణ్య- రమేష్ దంపతుల వివాహ దినోత్సవ సందర్భంగా అన్నిదానాల్లో కెల్ల శ్రేష్టమైన అన్నదానం నిర్వహించడం బాగుందని తెరాస మండల అధ్యక్షులు ప్రేమ్ చందర్ రావు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఏ.పి.ఎం శ్రీనివాస్, మండల విద్యాధికారి సురేందర్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వీరగోని సుజాత రమేష్ గౌడ్, ఆచార్య ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ జవ్వాజి రాజేష్,కనుకుంట్లశోభ, కొమిరిశెట్టి,రమేష్,లావణ్య, ప్రపూర్ణ,బొంకూరి.శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.