Saturday, July 27, 2024
Homeతెలంగాణగీత కార్మికులతో పాలకుర్తి జెడ్.పి.టి.సి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం

గీత కార్మికులతో పాలకుర్తి జెడ్.పి.టి.సి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం

గీత కార్మికులతో పాలకుర్తి జెడ్.పి.టి.సి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం

పాలకుర్తి,మే07(కలం శ్రీ న్యూస్):రామగుండం నియోజక వర్గంలో పాలకుర్తి మండలం లోని కుక్కలగూడూర్ గ్రామంలో కే.సి.ఆర్. పైన ప్రేమ, అభిమానాన్ని , కృతజ్ఞతను గీత కార్మికులు వినూత్నంగా తెలియజేశారు.

ఇటీవల రైతుబీమా తరహాలో గీతకార్మికులకు బీమా ప్రకటించిన కేసీఆర్. గీతకార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల గీతకార్మికుల కుటుంబాలకు లభించనున్న భరోసా. విధి విధానాలు రూపొందించాలని మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు . దీనితో రాష్ట్రం లోనీ గీత కార్మికుల అందరిలో ఆనందం వెల్లువెత్తింది. ఈ సందర్బంగా పాలకుర్తి జెడ్.పి.టి.సి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కుక్కలగూడుర్ గ్రామం లో కే.సి.ఆర్. కి కృతజ్ఞతగా థాంక్స్ టు కేసీఆర్ అంటూ గీత కార్మికులు అక్షరాలతో తాటి చెట్టు ఎక్కి గౌడ కులస్తులు తమ కుల వృత్తి ద్వారా తాటి చెట్టుపై థాంక్స్ టు కేసీఆర్ అనే అక్షరాలని ప్రదర్శిస్తూ వినూత్నంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్బంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పోరాటాల గడ్డపైన ఉద్భవించిన వీరపుత్రుడు, స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు, రాష్ట్రం లో ప్రతి వర్గం సంక్షేమం కోసం ఆలోచించే కేసీఆర్ గౌడ కులస్తులకోసం గీతకార్మికులకు బీమా ప్రకటించిన కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

బంగారు తెలంగాణ కోసం పాటుపడుతూనే భారత భవిష్యత్తుని తీర్చిదిద్దుటకి కంకణం కట్టిన కరణ జన్ముడు గా కే.సి.ఆర్ ని అభివర్ణించారు. భవిష్యత్తులో తప్పకుండా భారత దేశంలో ప్రతి వర్గానికి కేసిఆర్ వల్ల బి.ఆర్.ఎస్ పార్టీ వల్ల మంచిరోజులు వస్తాయి భారత దేశానికి మంచిరోజులు రాబోతున్నాయి అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గౌడకులస్తులు గాజుల సత్తయ్య,బొమ్మగాని బుచ్చయ్య,గుర్ర భూమయ్య,చీకటి శ్రీనివాస్,ముక్కెర పొచయ్య,సత్త ఎలియ,పల్లె శ్రీనివాస్,బొమ్మగాని కొండాలు,పొన్నం మల్లేష్,పల్లె నారాయణ,బైరి వెంకటేష్,మంతెన రాజయ్య,నేరెళ్ల రాజయ్య,పొతరాజుల శేఖర్,మేడం మల్లయ్య,  గోపు రామన్న, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!