Wednesday, September 18, 2024
Homeతెలంగాణవరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరం చేస్తాం..

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరం చేస్తాం..

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరం చేస్తాం..

సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని, మే 5(కలం శ్రీ న్యూస్):వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముమ్మరం చేస్తామని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. డిసిఎంఎస్ ఆధ్వర్యంలో మంథని మండలం ఖాన్ సాయిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైస్ మిల్లులకు చేరవేస్తామని అన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు రైతులకు కళ్లాల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నామని తెలిపారు. రైతాంగం ఏ మాత్రం ఆందోళన చెందవద్దని చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు ఆకుల కిరణ్, సర్పంచులు మంథని లింగయ్య, బండ రమేష్, నాయకులు కుడుదుల సత్యనారాయణ, ఓరుగంటి శేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!