Sunday, May 26, 2024
Homeతెలంగాణబి ఆర్ ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మావోయిస్టులేఖ

బి ఆర్ ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మావోయిస్టులేఖ

బి ఆర్ ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మావోయిస్టులేఖ

మంథని,మే 04 (కలం శ్రీ న్యూస్): కాటారం మండలంలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. ఆంధ్ర పాలకులు తెలంగాణ లోని నిధులు నియామకాలు ఉద్యోగాలతో పాటు ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ దోపిడీ చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ జయశంకర్-మహబూబాబాద్-వరంగల్(2)-పెద్దపెల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ మీడియాకు విడుదల చేస్తున్న ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కావాలని విద్యార్థులు కార్మికులు రైతులు ఉద్యోగులు మహిళలు మేధావులు ప్రజాస్వామిక వాదులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అరెస్టులు చిత్రహింసలు కేసులు జైలుకు వెళ్లి ప్రాణాలకు తెగించి పోరాడి చాలామంది త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వెంటనే ప్రజా ఉద్యమాలను అణిచివేయడం కోసం పోలీసు వ్యవస్థను బలోపేతం చేసి సీసీ కెమెరాలు పెట్టి ఆధునికరించి ప్రతిపక్షాలతో పాటు ప్రజా ఉద్యమాలను అణిచివేస్తూ అధికార పార్టీ రియల్ వ్యాపారులు లంచాల కోసం ఇసుక కాంట్రాక్టు ఇచ్చి కమీషన్లు తీసుకొని నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుకను తీస్తున్నారని వెంకటేష్ ఆరోపించారు.మిడ్ మానేరులో ఇసుకను తీయడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడి పంటలు పండవని, కేసు వేసిన తర్వాత మైనింగ్ శాఖ నిలిపివేసిందని, అయినప్పటికీ అధికార పార్టీ అండతో సుల్తానాబాద్ వీణవంక నుండి మొదలుకొని గోదావరి కలిసే వరకు ఇప్పటికీ ఇసుక తీస్తూ అమ్ముతున్నారని, టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి, కాల్వపల్లి, చలివాగు, వాగోడ్డుపల్లి గ్రామాలలో ప్రస్తుతం స్థానిక లీడర్ల దగ్గర ఉండి ఇసుక తీసి విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు.గోదావరి నదిలో పెసా చట్టం ప్రకారం ఇసుకను తీయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ మధ్య దళారులే ఆదివాసీల పేరుతో కాంట్రాక్టు తీసుకొని ఇసుకను అక్రమంగా అమ్ముతున్నారని ఆరోపించారు. చట్ట విరుద్ధంగా అనుమతికి మించి ఎక్కువ క్యూబిక్ మీటర్లు ఇసుక తోడేస్తున్నారని దీనిపై ప్రతిపక్షాలు ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ రాజకీయ నాయకులకు అధికారులకు కమిషన్లు ఇచ్చి జెసిబిలతో తీసి అమ్ముతున్నారని ఆరోపించారు.అందులో పెద్దల హస్తముందని చెప్పిన వారిని మభ్యపెడుతున్నారని కాలేశ్వరం దగ్గర గోదావరినదిలో అక్రమంగా కొత్తగా రోడ్డు నిర్మాణం చేసి ఇసుకను తీసుకొని వెళుతున్నారని ప్రజలు చెప్పిన చూసి చూడనట్లు వదిలేస్తున్నారని మావోయిస్టు పెద్దపెల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఆరోపించారు. వరంగల్ హనుమకొండ దగ్గర ఆకేరువాగులో ఇసుక, కటాక్షపురం దగ్గర మట్టి, మొరం అక్రమంగా తోడేస్తూ విక్రయిస్తున్నారని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసిన నిలిపివేయడం లేదని కాటారం మండలంలో చెరువులో మట్టిని మొరంను తీసి విక్రయిస్తున్నారని కార్యదర్శి వెంకటేష్ ఆరోపించారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలో అడవుల్లో, గుట్టల్లో, చెరువు శిఖం భూముల్లో మట్టి మోరం తీసి రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఇళ్ల నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు శిఖం భూముల్లో రెండు నుండి ఆరు మీటర్ల వరకు, గుట్టలు , అడవుల నుండి ఐదు నుండి పది మీటర్ల వరకు జెసిబి లతో తవ్వడంతో పెద్ద గుంటలు ఏర్పాటు కాగా పశువులు మేకలు, గొర్లు తిరగకుండా తీస్తూ మత్స్యకారులకు కూడా తీవ్ర నష్టాన్ని కనబరుస్తున్నారని మావోయిస్టు జె ఎం డబ్ల్యూ పి కమిటీ కార్యదర్శి వెంకటేష్ తీవ్రంగా ఆరోపించారు.

అధికార బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇచ్చి దానికంటే అక్రమంగా ఇసుక మొరం మట్టిని తోడుకొమ్మని ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ లీడర్లు కమిషన్లు తీసుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారని అక్రమంగా ప్రకృతి వనరులను ధ్వంసం చేయడం బందు పెట్టేవరకు ప్రజలు పోరాడాలని అన్ని వర్గాల ప్రజలను, ప్రజాస్వామిక వాదులకు మావోయిస్టు కార్యదర్శి వెంకటేష్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!