Tuesday, December 3, 2024
Homeతెలంగాణకేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్

మంథని, మే 4(కలం శ్రీ న్యూస్):  రామగిరి మండలంలోని కల్వచెర్ల ఎల్లమ్మ గుడి ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తున్నారాని రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ ఆధ్వర్యంలో గీత కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి,కేటీఆర్ కిి, ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ కి, కొప్పుల ఈశ్వర్ కి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గీతా కార్మికుల సంక్షేమం కోసం రైతు బీమా తరహాలో గీత కార్మికులకు భీమా సౌకర్యం కల్పించడం హర్షనీయం అన్నారు.గీత వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగించే గీత కార్మికులు గతంలో ప్రమాదవశాత్తు మరణించిన,గాయపడ్డ ఎక్స్ గ్రేషియా మంజూరు కావడంలో ఆలస్యం అయ్యేది అన్నారు. కానీ ఈనాడు మన కేసీఆర్ నిర్ణయంతో రైతు బీమా తరహాలో గీత కార్మికునికి ప్రమాదం జరిగితే వెంటనే ఎక్స్ గ్రేషియా లభిస్తుందని వారు అన్నారు.అలాగే కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేలా నీరా కేఫ్ లను ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. గీత కార్మికుల భీమా సౌకర్యాన్ని అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కల్వచెర్ల గీత కార్మిక సంఘం అద్యక్షులు రాజేందర్ గౌడ్,బుర్గు బూమాగౌడ్,నాలోని రవి గౌడ్,గొల్లపల్లి కృష్ణగౌడ్,లక్ష్మణ్ గౌడ్,కాట తిరుపతిగౌడ్,శంకర్ గౌడ్,అనిల్ గౌడ్ ,రమేష్ గౌడ్,వెంకటేష్ గౌడ్,కమ్మటి అంజయ్యగౌడ్,జువాజి కనుకయ్యగౌడ్, పడాల వేణు గౌడ్, పడాల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!