Saturday, July 27, 2024
Homeతెలంగాణవిద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాలకు పాల్పడిన ఏడుగురు నిందితులపై పీడీయాక్ట్

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాలకు పాల్పడిన ఏడుగురు నిందితులపై పీడీయాక్ట్

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాలకు పాల్పడిన ఏడుగురు నిందితులపై పీడీయాక్ట్

మంథని, మే 3(కలం శ్రీ న్యూస్): వరుసగా వ్యవసాయ విద్యుత్తు టాన్స్ ఫార్మర్స్ ధ్వంసం చేసి, అందులోనున్న కాపర్ కాయిల్స్ దొంగిలించడం వంటి నేరాలకు పాల్పడుతున్న నిందితులపై రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేసినారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో వ్యవసాయ విద్యుత్తు టాన్స్ ఫార్మర్స్ ధ్వంసం చేసి, అందులోనున్న కాపర్ కాయిల్స్ దొంగిలించడం వంటి నేరాలకు పాల్పడిన మద్ధిపల్లి సాయితేజ,దోనిపల్లి సురేష్,మీనుగు మల్లేష్,రేగుంట వర్ధన్,చిన్నకుర్తి రాకేష్,పులి భరద్వాజ్,మినుగు బానేష్, ఇందారం గ్రామము, జైపూర్ మండలము,మంచిర్యాల జిల్లా అను వారిపై రామగుండం పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్ఐ వెంకటేశ్వర్ నిందితులకి కరీంనగర్ జిల్లా కారాగారం లో అందజేసారు. అనంతరం నిందితులను చర్లపల్లి కారాగారానికి తరలించారు.పీడీ యాక్ట్ అందుకున్న నిందితుల పై గతం లో మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో-09,చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో-06, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో-06, భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో-02, కొయ్యురు పోలీస్ స్టేషన్ పరిధిలో-01, కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో-01, నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో-01, దండేపల్లి పోలీస్ పరిధిలో -02, కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో-01, కాలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో-01, గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో-01, అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో-03, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో -02, ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో-01, కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో -01 మొత్తం 41 కేసులు ఏడుగురుపై నమోదు చేయడం జరిగింది అట్టి కేసులలో మంథని పోలీసులు అరెస్ట్ చేసారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ చట్టవ్యతిరేక కార్య కలపాలకు పాల్పడే వ్యకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

 

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!