Wednesday, May 29, 2024
Homeతెలంగాణఅలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం

అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం

అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం

ధర్మారం, మే01 (కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండల కేంద్రంలో స్థానికంగా రిక్షా తొక్కుతు జీవనం సాగిస్తున్న కార్మికులు మేడవేణి రమేష్, గుడెల్లి మల్లేశం లను ఈరోజు అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ అండ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత సిరిపురం సత్యనారాయణ మరియు డిస్టిక్ 258 జోన్ చైర్మన్ తాళ్లపల్లి సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రిక్షా కార్మికులను సన్మానించి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఈ రిక్షా కార్మికులు రోజువారి కూలీలుగా మారి వ్యాపారస్తుల దుకాణాల నుండి సామానులను ఒక చోట నుండి మరొక చోటికి తరలిస్తూ రక్తంతో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళ శ్రమను గుర్తించి సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్మికుల శ్రమ గుర్తించే రోజు ప్రతిరోజు కావాలి. శ్రమను నమ్ముకుని బ్రతుకుతున్న కార్మికులను స్మరించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ తాళ్లపల్లి సురేందర్ గౌడ్, అధ్యక్షులు కొత్త మోహన్, సెక్రెటరీ మామిడి శెట్టి శ్రీనివాస్, ట్రెజరీ ఎలిగేటి మహేందర్, పి ఆర్ ఓ బైరి చంద్రమౌళి, ఉపాధ్యక్షులు తోడేటి మురళి గౌడ్, కందుల సతీష్, జాయింట్ సెక్రెటరీ అమరపల్లి నారాయణ, క్లబ్ గౌరవ సభ్యులు మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బొల్లం మల్లేశం, గోలి సత్యం, శాతరాజుల సుమన్, విజ్జగిరి సతీష్,టీవీ రిపేర్ కరుణాకర్,సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, భూక్య నరేష్ నాయక్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!