Tuesday, September 17, 2024
Homeతెలంగాణనెరవేరనున్న చెగ్యాం ముంపు గ్రామస్తుల ఏళ్లనాటి కల

నెరవేరనున్న చెగ్యాం ముంపు గ్రామస్తుల ఏళ్లనాటి కల

నెరవేరనున్న చెగ్యాం ముంపు గ్రామస్తుల ఏళ్లనాటి కల

వెల్గటూర్, మే 01 (కలం శ్రీ న్యూస్):అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, శ్రీపాద ఎల్లంపల్లి ముంపు గ్రామమైన చెగ్యాం గ్రామ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా పరిహారం అందని బాధితులకు వారం రోజులలోగా విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఎల్లంపెల్లి ముంపు గ్రామమైన చెగ్యాం గ్రామం నుండి సుమారు 135 మంది పునరావాస భాదితులు సర్పంచ్ రామిల్ల లావణ్య సనీల్ ఆద్వర్యంలో హైదరాబాదులోని బీ ఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి సమస్యను వివరించారు.తక్షణమే స్పందించిన మంత్రి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ను కలిసి నిర్వాసితుల సమస్యలను వివరించారు. 2009 సంవత్సరంలోనే 135 మంది ఇళ్లకు పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు మంజూరు కాలేదని, 18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం అందించాలని 20 ఎకరాల భూమికి సంబంధించి పరిహారంతో పాటు ఆవాజ్ భూమి కింద ప్రభుత్వ భూమికి నిధులు ఇవ్వాలని,పాత దేవాలయాలను పునః నిర్మించాలని గ్రామస్థులు మంత్రిని కోరగా ఫైరవీ కారుల మాటలతోనే జాప్యం జరిగిందని ప్రభుత్వం విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.మంత్రి హామీతో సర్పంచ్ రామిల్ల లావణ్య సనీల్, గ్రామస్థులు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!