Sunday, May 26, 2024
Homeతెలంగాణకొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర

కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర

కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర

సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని ఏప్రిల్ 28(కలం శ్రీ న్యూస్ ):వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. పీఏసీఎస్, డీసీఎంఎస్ పరిధి మంథని మండలం చిన్న ఓదాల, స్వర్ణపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,అడవిసోమన్ పల్లి సెంటర్ సంఘ డైరెక్టర్ సిరిమూర్తి ఓదేలు,మల్లారం సెంటర్ ఏఎంసి చైర్మన్ ఎక్కటి అనంత రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఏ గ్రేడ్ రకానికి రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. వరి ధాన్యం అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామని తెలిపారు. కేంద్రాల్లో రైతులకు మంచినీటి సౌకర్యం, రైతులు సేద తీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్నందున రైతులు, సెంటర్ ఇంఛార్జీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రైతులు తమ యొక్క ధాన్యం విక్రయించేందుకు ముందుగా పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్ ప్రతులు సెంటర్ ఇంఛార్జీలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, లెక్కల కిషన్ రెడ్డి, దేవల్ల విజయ్ కుమార్, సర్పంచులు మానేం సత్యనారాయణ,ఎడ్ల పద్మ-బాపు,నాయకులు గట్టు సంజీవ్,గట్టు సత్యనారాయణ, ఇప్ప వెంకటస్వామి, సమ్మయ్య, మానేం విసయ్య, పోట్ల మల్లేష్గ్, జక్కు రమేష్, చీపిరిశెట్టి సమ్మయ్య, శ్రీనివాస్, మహేష్, సంఘ సీఈఓ మామిడాల అశోక్ కుమార్, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!