సిపిఐ ఆధ్వర్యంలో బస్సు యాత్ర…..
మంథని ఏప్రిల్ 27(కలం శ్రీ న్యూస్ ):మంథనిలో సిపిఐ ఆధ్వర్యంలో బస్సు యాత్ర కార్యక్రమాన్ని గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయడానికి టెండర్ పిలవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకురావాలని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలు చేయాలని, లౌకిక వ్యవస్త విధ్వంసాన్ని, ఫాస్టిస్ తరహా పాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రజా నాట్యమండలి కళాకారులు పాటలు,నృత్యాలతో కేంద్ర ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, నాయకులు గౌతమ్ గోవర్ధన్, కొవ్వూరి రాజలింగు, రౌతు మల్లయ్య, ప్రకాష్ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.