సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎక్లాస్ పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు
మంథని ఏప్రిల్ 20(కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో ఏఐసీసీ కార్యదర్శి మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గురువారం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన సళ్ళం శంకర్ కి 12000 , ఎడ్ల లింగయ్య కి 13500 రూపాయల విలువ గల చెక్కును వారికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంజర్ల శేఖర్ వార్డ్ సభ్యులు డాంక శ్రీనివాస్, బూడిద రంజిత్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాధారపు నితీష్, జంజర్ల శైలందర్, ఆదర్శ్, రాకేష్, కళ్యాణ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.