Thursday, April 18, 2024
Homeతెలంగాణరైతులను గొప్పగా చూడాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

రైతులను గొప్పగా చూడాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

రైతులను గొప్పగా చూడాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్

మంథని 19(కలం శ్రీ న్యూస్ ):బీఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ కరంటు,నీళ్లు,మందు బస్తాలు ఇచ్చి, పంటకు పెట్టుబడి సాయం ఇచ్చి రైతులను గొప్పగా చూడాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి.,మంథని పరిధిలోని ఎక్లాస్ పూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గింజ పోకుండా కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రైతులు ప్రతి పంట వచ్చినప్పుడల్లా రైస్ మిల్లర్లు వర్సెస్ రైతులు,హమాలీలు వర్సెస్ రైతులకు కొన్ని ఘర్షణలు జరుగుతుంటాయని, అట్టి ఘర్షణలు జరగకుండా రైతులు కూడా వడ్లను శుభ్రపర్చి తీసుకురావాలని, హమాలీలు కూడా రైతులు తీసుకువచ్చిన పంటను కాంటాలు పెట్టి అండగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, వడగండ్ల వానలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులను కాపాడుకునే కార్యక్రమంలో కల్లాల ఇంఛార్జీలు శ్రద్ధ చూపించాలని, అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని,కాబట్టి ఒకరికొకరు సమన్వయంతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. రైస్ మిల్లర్లతో ఏదేని ఇబ్బంది వస్తే వారికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చూసుకుంటామని, మనకు పౌర సరఫరాల శాఖ మాత్యులు గంగుల కమలాకర్ ఉన్నారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని అన్నారు. ఖానాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆరుగాలం శ్రమించి వరి ధాన్యం పండించిన రైతులను అగ్రభాగాన నిలపడమే తమ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సహకారంతో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని తెలిపారు. కాకర్లపల్లి సెంటర్ ను ఎంపిపి కొండ శంకర్, గోపాల్ పూర్ కేంద్రాన్ని ఏఎంసి చైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి, సూరయ్యపల్లి సెంటర్ రైతుబంధు అధ్యక్షులు ఆకుల కిరణ్, ప్రారంభించారు. ముందుగా ఎక్లాస్ పూర్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కుసింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎక్లాస్ పూర్ సర్పంచ్ చెన్నవేన సదానందం పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు.వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిమూర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దేవళ్ల విజయ్ కుమార్, జెడ్పీటీసీ తగరం సుమలత-శంకర్ లాల్, సర్పంచులు చెన్నవేన సదానందం, పుట్ట వెంకటమ్మ-రామయ్య, కెక్కర్ల సునీత, భీముని పుష్ప-వెంకటస్వామి, కన్నెబోయిన పద్మ-కొమురయ్య, ఎంపిటీసీ తొంబురపు సుజాత-తిరుపతి, ఏఎంసి డైరెక్టర్లు గొబ్బూరి వంశీ, ఉడుత లింగయ్య, జంజర్ల లింగయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, యూత్ అధ్యక్షుడు కొండ రవీందర్, సిఈఓ మామిడాల అశోక్ కుమార్, ఆర్ ఐ త్రివేణి, నాయకులు మంథని లక్ష్మణ్, వేల్పుల గట్టయ్య, లొడారి రాములు, రాదండి శంకర్, అమ్మకుంటి మల్లేష్,పుట్ట శంకరయ్య, పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!