జర్నలిస్టుల సంతకాల సేకరణను విజయవంతం చేయండి
ఈనెల 19న జర్నలిస్టుల సంతకాల సేకరణ
– టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి సుంక మహేష్
పెద్దపల్లి ఏప్రిల్ 17 కలం శ్రీ న్యూస్,
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే జర్నలిస్టుల సంతకాల సేకరణ ను విజయవంతం చేయాలని టిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ లు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరుతూ టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఈనెల 19 బుధవారం జర్నలిస్టు సంతకాల సేకరణ చేపడుతున్నామని, జిల్లాలోని జర్నలిస్టులు ,మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా తమ వంతు సంఘీభావం తెలిపి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రకటనలో కోరారు.